కెప్టెన్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన ప్రధాని మోడీ, డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు

الخميس، 1 أكتوبر 2026

Donald Trump He hailed Trump as a hero. international national Netanyahu praised Captain Matcher's courage PM Modi

t f B! P L

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో హీరో భారత పైలట్ స్మిత్ మచ్చర్ ను ప్రధాని మోడీతో సహా ప్రపంచ నాయకులు ప్రశంసించారు. మచ్చర్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆకాశంలో ఉండగానే కో-పైలట్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్‌ను ట్రంప్ హీరోగా అభివర్ణించారు. ప్రయాణికులను రక్షించేందుకు తీవ్ర గాయాలతో కూడా ఆయన వ్యవహరించిన తీరును ప్రశంసించారు. అదే సమయంలో దాడికి పాల్పడిన కో-పైలట్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను 'బహుశా ఉగ్రవాది అయి ఉండొచ్చు లేదా పిచ్చివాడు అయి ఉండొచ్చు'' అని అన్నారు. అంతకుముందు X వేదికగా ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన మచ్చర్‌ను ఇద్దరు నేతలు హీరోగా అభివర్ణించారు. కెప్టెన్ మచ్చర్ ధైర్యాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం, అచంచలమైన సంకల్పం వందలాది మంది ప్రాణాలను రక్షించిందని మోడీ అన్నారు. ఓ పెను విషాదాన్ని మచ్చర్ తన ధైర్యంతో నివారించారని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా మచ్చర్‌ను 'నిజమైన హీరో'గా అభివర్ణించారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్ ఎదురుతిరిగి, కాక్‌పిట్ తలుపు తెరిచారని, దీంతో ప్రయాణికులు, సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారని అన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడికి పాల్పడినట్లు భావిస్తున్న మరో పైలట్‌ను సౌదీ అధికారులు అరెస్టు చేశారు. దాడికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ