టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20లో విధ్వంసకర శతకంతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్(43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 నాటౌట్) ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 7వ స్థానంలో నిలిచాడు. అయ్యర్ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం. ఇషాన్ కిషన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, అభిషేక్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తిలక్ వర్మ 10వ స్థానంలో నిలిచాడు. టీ20 బ్యాటింగ్ టాప్-10 ర్యాంకింగ్స్‌లో నలుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం విశేషం. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌ను వెనక్కి నెట్టి రషీద్ 8వ సారి నంబర్ 1 ర్యాంకును అందుకున్నాడు. టీ20 చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం నం.01గా నిలిచిన బౌలర్‌గా రషీద్ రికార్డు సృష్టించాడు. గత మూడు మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించిన భారత స్పిన్ ఆల్-రౌండర్ అక్షర్ పటేల్ 16 స్థానాలు ఎగబాకి 7వ ర్యాంకును అందుకున్నాడు.
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ : 7వ స్థానానికి ఎగబాకిన శ్రేయస్ అయ్యర్
الأربعاء، 7 أكتوبر 2026
Abhishek Sharma continues in second place cricket ICC T20 Batting Rankings Ishan Kishan retained the top spot Shreyas Iyer Climbs to 7th Spot sports

ليست هناك تعليقات:
إرسال تعليق