News Breaking
Live
wb_sunny

Breaking News

అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన : 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు రద్దు

అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన : 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు రద్దు

న్యూఢిల్లీలో అక్టోబర్ 10వ తేదీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చి పోయే రైళ్ల సర్వీసులు అన్నింటిని రద్దు చేసింది. ఈ మేరకు భారతీయ రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం ఉదయం 4.00 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల మధ్య ఆయా స్టేషన్లకు రైల్వే సర్వీసులు నడవవని స్పష్టం చేసింది. ఈ స్టేషన్ల నుంచి మొత్తం10 గంటల పాటు రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపింది. ఆ క్రమంలో ఈ రెండు స్టేషన్లకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అక్టోబర్ 9వ తేదీన బయలుదేరే సర్వీసులను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే చెప్పింది. తూర్పు రైల్వే పరిధిలోని పశ్చిమ బెంగాల్ నుంచి న్యూఢిల్లీ చేరుకోవాల్సిన రెండు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. 12301 హౌరా- న్యూఢిల్లీ, 12313 సీల్దా - న్యూఢిల్లీ సర్వీసులు రద్దయ్యాయని వివరించింది. శనివారం న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల వద్ద భారీగా ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారతీయ రైల్వే వివరణ ఇచ్చింది. మరో వైపు న్యూఢిల్లోని 57 మెట్రో స్టేషన్లు మూసి వేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది. నేడు( అక్టోబర్ 9వ తేదీ ) రాత్రి 9.00 నుంచి శనివారం వరకు ఈ మెట్రో స్టేషన్లు మూసి వేస్తున్నటు జారీ చేసిన ప్రకటనలో డీఎంఆర్‌సీ వివరించింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా.. మెట్రో స్టేషన్ల ఎంట్రన్స్, ఎగ్జిట్స్ మూసి వేయ్యాలని డీఎంఆర్‌సీకి ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment