హైదరాబాద్ లో ఈరోజు ఏకధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మండపాలు, నిమజ్జన ప్రాంతాలు, రహదారులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, డీ-సిల్టింగ్ పూడిక, డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఎయిర్‌టెక్ యంత్రాలను సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లో ఏకధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షం : పలు ప్రాంతాలు జలయమం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق