ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఏనుగుబాల వీఆర్ఓపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. నిన్న రాత్రి మారందొడ్డిలోని ఇంట్లో వీఆర్ఓ బోయ గోపాల్ నిద్రిస్తుండగా దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. గోపాల్ ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

أحدث أقدم