అమెరికాలో బాల్టిమోర్ నుంచి మియామికి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ యువతి బట్టలు విప్పింది. తోటి ప్రయాణికుల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించింది. దీంతో విమాన సిబ్బంది కాక్‌పిట్ సిబ్బందిని అప్రమత్తం చేసి, విమానం మయామి చేరుకున్న వెంటనే పోలీసులను పిలిపించారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఏఏ1779 విమానంలో ఈ ఘటన జరిగింది. బాల్టిమోర్/వాషింగ్టన్ ఇంటర్నేషనల్ థర్గుడ్ మార్షల్ విమానాశ్రయం నుంచి రాత్రి 9 గంటల తర్వాత విమానం బయలుదేరింది. షెడ్యూల్ కంటే దాదాపు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరిన ఎయిర్‌బస్ ఏ319లో ప్రయాణికులు మియామికి వెళ్తున్నారు. విమానంలోని 9డీ సీటులో కూర్చున్న మహిళ "తన బట్టలన్నీ విప్పేసింది" అని విమాన సిబ్బంది ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రెసింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ సందేశంలో పేర్కొన్నారు. ఆమె ప్రయాణికుల సమక్షంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కూడా తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయంలోని నార్త్ టెర్మినల్ డీ2 గేట్‌కు విమానం చేరుకోగా, అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
విమానంలో బట్టలు విప్పి తోటి ప్రయాణికుల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన యువతి : అదుపులోకి తీసుకున్న పోలీసులు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق