బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా అల్గునూర్ వద్ద రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా లారీకి కేటీఆర్ కారు డోర్ తాకింది. ఈ అకస్మాత్తు ప్రమాదంలో అప్రమత్తమైన కేటీఆర్ కారు డ్రైవర్ తక్షణమే స్పందించి కారును అదుపులోకి తీసుకున్నారు. ఈ అనూహ్య ఘటనలో కేటీఆర్ కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
إرسال تعليق