రిలయన్స్ జియో పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ.3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రత్యేక ప్రయోజనాలతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌కు 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. 5Gకి అనుకూలమైన ప్రాంతాలు, డివైజ్‌లలో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటాతో పాటు అదనంగా 120GB బోనస్ డేటాను జియో అందిస్తోంది. ఏడాది కాలంలో నెలకు 10GB చొప్పున ఈ అదనపు డేటా వోచర్ల రూపంలో లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. రోజువారీ 2.5GB హైస్పీడ్ డేటా పూర్తయిన తర్వాత ఆ రోజు డేటా స్పీడ్ 64 Kbpsకు తగ్గుతుంది. ఈ యానివర్సరీ ఆఫర్‌లో ప్రత్యేక ఆకర్షణ గూగుల్ జెమినీ ప్రో. అర్హత ఉన్న వినియోగదారులకు 18 నెలల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇందులో అధునాతన AI ఫీచర్లతో పాటు 5,000GB అంటే 5TB క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. JioAICloudలో అదనంగా 50GB స్టోరేజ్ ప్రయోజనం కూడా ఉంది. ఎంటర్‌టైన్మెంట్ కోసం JioHotstar Mobile+ సబ్‌స్క్రిప్షన్, JioTV Pro Pack లభిస్తాయి. JioTV Pro ద్వారా 1,000కిపైగా లైవ్ టీవీ ఛానళ్లను ఏడాది పాటు యాక్సెస్ చేయొచ్చు. MyJio యాప్ ద్వారా EaseMyTrip, AJIO, Cinépolis వంటి భాగస్వామ్య సంస్థల వోచర్లను కూడా అందిస్తున్నారు. EaseMyTripలో రూ.2,200 వరకు ప్రయోజనం, AJIOలో రూ.1,000కు పైగా కొనుగోలుపై రూ.200 వోచర్, Cinépolisలో రూ.150 డిస్కౌంట్ వంటి ఆఫర్లు ఉన్నాయి.
జియో యానివర్సరీ ఆఫర్ : రూ.3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق