యెమెన్ గగనతలంపై ఎగురుతున్న సౌదీ ఎఫ్ 15 ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు హుతీలు ప్రకటించారు. మిత్రదేశం అమెరికా నుంచి తీసుకుని వాడుతున్న ఎఫ్15 ఫైటర్ జెట్ ను హుతీలు కూల్చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. నిన్న మొన్నటివరకూ హుతీల్ని యెమెన్ లో ఇరాన్ మద్దతు కలిగిన చిన్న రెబెల్ గ్రూప్ గా పరిగణించిన వారికి ఇప్పుడు వారి సత్తా తెలుస్తోంది. ఇరాన్ ఇచ్చిన క్షిపణులు, డ్రోన్లతో సౌదీ మీద హుతీలు చేస్తున్న యుద్దం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. యెమెన్‌లోని వివాదాస్పద మరిబ్ ప్రావిన్స్ గగనతలంలో సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని విజయవంతంగా కూల్చివేసినట్లు హుతీ సైనిక దళాలు ప్రకటించాయి. తమ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన ఉపరితలం నుండి గగనతలంలోకి దూసుకెళ్లే అత్యాధునిక క్షిపణి సహాయంతో ఈ విమానాన్ని నేలకూల్చినట్లు హుతీ ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. అయితే హుతీల ఆరోపణలను సౌదీ అరేబియా ప్రభుత్వం ధృవీకరించలేదు. మక్కా నగరం తమకు అత్యంత పవిత్రమైనదని, దాని భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తి లేదని సౌదీ సంకీర్ణ దళాలు హెచ్చరించాయి. కాగా తాము పవిత్ర ఇస్లామిక్ క్షేత్రాలకు ఎలాంటి హాని తలపెట్టలేదని హుతీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
యెమెన్ గగనతలంపై ఎగురుతున్న సౌదీ ఎఫ్ 15 ఫైటర్ జెట్ కూల్చివేత !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق