హోండా డియో 110 స్కూటర్ 110cc ఇంజన్ శక్తివంతమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడిపేలా రూపొందించబడిన ఈ మోడల్ మైలేజ్ తో పాటు కంఫర్ట్ రెండింటినీ అందిస్తుంది . స్పోర్టీ డిజైన్, LED హెడ్‌ల్యాంప్, డిజిటల్ మీటర్, హోండా స్మార్ట్ టెక్నాలజీతో ఇది యువ రైడర్స్‌కి ఆకర్షణీయంగా ఉంటుంది. సేఫ్టీ కోసం CBS బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్‌లో మెరుగైన స్థిరత్వం, కలర్ వేరియంట్స్‌ తో అందుబాటులో ఉంటుంది . స్టైల్, పెర్ఫార్మన్స్ , నమ్మకమైన టెక్నాలజీ తో హోండా డియో 110 స్కూటర్ రోజువారీ ప్రయాణాలకు సరైన స్కూటర్ గా నిలుస్తుంది. డియో 109.51cc 4-స్ట్రోక్ SI ఇంజన్‌తో వస్తుంది. ఇది 7.95 PS @ 8000 rpm పవర్ , 9.03 Nm @ 5500 rpm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాప్ స్పీడ్ 83 kmph తో ఇది సిటీ రైడింగ్‌కి బెస్ట్ . మైలేజ్ సుమారు 48-50 kmpl వరకు అందిస్తుంది. Idling Stop System, PGM-FI టెక్నాలజీ ఫ్యూయల్ ఎఫిషియెన్సీని పెంచుతాయి. డిజైన్ పరంగా LED పొజిషన్ ల్యాంప్, స్పోర్టీ బాడీ కిట్, అలాయ్ వీల్స్, స్టైలిష్ మఫ్లర్ ప్రొటెక్టర్ ఉన్నాయి. DLX వేరియంట్‌లో TFT డిజిటల్ మీటర్ ఉంటుంది. ఇది ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, సర్వీస్ రిమైండర్స్ చూపిస్తుంది. ఇంకా దీనిలో USB-C ఛార్జింగ్ పోర్ట్, డబుల్ లిడ్ ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్, అండర్‌సీట్ స్టోరేజ్ లైట్ వంటి కంఫర్ట్ ఫీచర్స్ ఉన్నాయి. సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ , యూనిట్ స్వింగ్ రియర్ సస్పెన్షన్‌తో వస్తుంది. ఇది రైడింగ్‌లో స్థిరత్వాన్ని ఇస్తుంది. బ్రేకులు CBS (Combi Brake System) తో 130mm డ్రమ్ బ్రేకులు ముందు, వెనుక ఉన్నాయి . 160mm గ్రౌండ్ క్లియరెన్స్, 765mm సీటు ఎత్తు, 1260mm వీల్‌బేస్, 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ తో బెస్ట్ రైడింగ్ అందిస్తుంది .వివిధ ఆకర్షణీయమైన కలర్స్ స్టైలిష్ షేడ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది రెండు వేరియంట్స్ Standard (Analog Meter) , DLXలలో వస్తుంది


Post a Comment

أحدث أقدم