E20 పెట్రోల్ ను ముందే వద్దన్న మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా : బయటపెట్టిన రాయిటర్స్ వార్తా సంస్ద

Thursday, August 13, 2026

and Mahindra Had Previously Opposed E20 Petrol Maruti national Reuters Reveals sent emails to the Society of Indian Automobile Manufacturers tata motors technology

t f B! P L

20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ E20 వాడకం వల్ల తమ వాహనాలు పాడైపోతున్నాయని, మైలేజ్ కూడా తగ్గిపోతుందని వాహనదారులు ఆరోపించడం ప్రారంభించారు. దీంతో కేంద్రం ఇప్పుడు పదే పదే ఈ20 పెట్రోల్ తో ఎలాంటి నష్టం లేదని చెప్పుకొస్తోంది. అయినా ఈ20ని వాహనదారుల కంటే ముందు కార్ల తయారీ సంస్థలే వద్దని చెప్పినట్లు అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్ బయటపెట్టింది. కేంద్రం తాజాగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల ఎలాంటి నష్టం లేదని పదే పదే చెప్తున్న తరుణంలో కార్ల తయారీదారుల సంస్థ అయిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ కు గతంలో తాము పంపిన మెయిల్స్ ను మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా వంటి సంస్థలు వెనక్కి తీసుకున్నాయి. అయితే ఇంతకీ ఆ మెయిల్స్ లో అవేం చెప్పాయన్న దానిపై అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్ వివరాలు వెల్లడించింది. ఇందులో ఆయా సంస్థలు ఇథనాల్ కలిపిన పెట్రోల్ లో మితిమీరిన క్లోరైడ్, తేమ శాతం ఉండటం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు తేలింది. ఈ సంస్థలకు దేశంలో 67 శాతం కార్ల వాటాఉంది. ఆయా కార్ల తయారీ సంస్థలు బహిరంగంగా ఈ20 వినియోగాన్ని సమర్థిస్తున్నప్పటికీ దీని నాణ్యతపై మాత్రం అంతర్గతంగా తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు దీన్ని బట్టి అర్దమవుతోంది. దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల నుండి సేకరించిన 250కి పైగా ఇంధన నమూనాల పరీక్షల్లో ఇంధన నాణ్యత సరిగా లేదని పరిశ్రమ వర్గాలు గుర్తించాయి. కార్ల తయారీ సంస్థలు స్వయంగా నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. నిబంధనల ప్రకారం పెట్రోల్‌లో క్లోరైడ్ కేవలం 3 పీపీఎమ్ మాత్రమే ఉండాల్సి ఉండగా, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి చోట్ల దీని స్థాయి 1.4 నుండి 570 పీపీఎమ్ వరకు ఉందని తేలింది. దీని వల్ల వాహనాల ఇంధన ఇంజెక్టర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే పెట్రోల్‌లో తేమ శాతం ఎక్కువైతే వాహనాలు ప్రయాణ మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ