భారత క్రికెట్ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ నియమించనున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. టీమిండియా హెడ్ కోచ్, సెలెక్షన్ కమిటీతో పాటు భారత క్రికెట్ కార్యకలాపాలకు వీవీఎస్ లక్ష్మణ్ సూపిరియర్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియా పురుషుల సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవి కాలం సెప్టెంబర్‌లో ముగియనుంది. మరోవైపు జాతీయ జట్టు కోచింగ్ వ్యవస్థ కూడా పరిశీలనలో ఉండటంతో బీసీసీఐ కీలక మార్పులు చేసేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే వీవీఎస్ లక్ష్మణ్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని అప్పగించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవి కాలాన్ని వన్డే ప్రపంచకప్ 2027 వరకు పొడిగించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటగాళ్ల అభివృద్ధి, అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవితో అతనికి బాధ్యతలు మరింత పెరగనున్నాయి. అయితే ఈ నియామకంపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
إرسال تعليق