హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది.భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతాయం ఏర్పడింది. 255 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి మండి జిల్లా అత్యంత తీవ్ర ప్రభావానికి గురైంది. ఇక్కడ 51 రోడ్లు మూసుకుపోవడంతో పాటు భారీ సంఖ్యలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. కులు, సిమ్లా, చంబా వంటి ఇతర జిల్లాలు కూడా రోడ్లు మూసివేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రకృతి ప్రకోపం వల్ల ఇప్పటి వరకు 155 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 68 మంది విపత్తు సంబంధిత కారణాలతో, 87 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. సుమారు రూ. 8,352.62 కోట్ల నష్టం వాటిల్లడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడింది. పునరావస చర్యలపై అధికారులు దృష్టి సారించారు.
హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు స్తంభించిన జనజీవనం : విద్యుత్ సరఫరా నిలిపివేత
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق