హారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని జప్తలై గ్రామంలో ఒక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినుల పాము కాటు వేసింది. వీరిని దగ్గరలోని ధనోరా గ్రామీణ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గడ్చిరోలి జిల్లా జనరల్‌ ఆస్పత్రికి పంపి చికిత్స అందిస్తుండగా ముగ్గురు మరణించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్‌ ద్వారా నాగపూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. గడ్చిరోలి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆశిష్‌ జైస్తాల్‌ పాఠశాలకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను రక్షించేందుకు పోలీసులు, జిల్లా అధికారులు వైద్యాధికారులతో మాట్లాడుతున్నారు. మరణించిన విద్యార్థినుల వయసు 8, 12, 14 సంవత్సరాలు. పాఠశాల యాజమాన్యంపై ప్రజలు, విద్యార్థినుల తల్లిదండ్రలు తీవ్రంగా మండిపడ్డారు. భద్రతా లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post a Comment

أحدث أقدم