ర్యానాకు చెందిన అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ దలాల్ గుండెపోటుతో కన్నుమూశాడు. బుధవారం ఉదయం మోహిత్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో చికిత్స కోసం వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. గుండెపోటు కారణంగానే మరణించినట్లు వెల్లడించారు. మోహిత్ మరణం కబడ్డీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దలాల్ హర్యానాలోని జింద్ జిల్లా, నంద్‌గఢ్ గ్రామానికి చెందినవాడు. మోహిత్ కొన్ని రోజుల క్రితం గాయపడ్డాడు. ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. మోహిత్ 10 సంవత్సరాల వయస్సులో కబడ్డీ ఆడటం ప్రారంభించాడు. గ్రామ మాజీ మల్లయోధుడైన ప్రకాష్ క్రీడలో శిక్షణ ఇచ్చాడు. కఠోర శ్రమ, కఠోరమైన రోజువారీ సాధన ద్వారా కబడ్డీ క్రీడలో ప్రావీణ్యం సంపాదించాడు. మోహిత్ అనేక ప్రధాన కబడ్డీ టోర్నమెంట్లలో ఉత్తమ రైడర్‌గా కూడా నిలిచాడు.

Post a Comment

أحدث أقدم