న్యూరోసర్జన్ డాక్టర్ మోహనరావు పాటిబండ్లకు మూడు పురస్కారాలు ప్రదానం

Monday, August 3, 2026

Andhra Pradesh founder and chief neurosurgeon of Ravas Hospital guntur Three Awards Conferred Upon Neurosurgeon Dr. Mohana Rao Patibandla

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్, రావాస్ హాస్పిటల్ - ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ వ్యవస్థాపకులు, చీఫ్ న్యూరోసర్జన్  డాక్టర్ మోహనరావు పాటిబండ్ల కు చెన్నైలో జరిగిన అంతర్జాతీయ వెన్నెముక శస్త్రచికిత్స సదస్సులో మూడు ప్రతిష్ఠాత్మక శాస్త్రీయ అవార్డులు అందుకున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు పాల్గొన్న PASMISS - MISSABCON - COSSCON 2026 సదస్సులో డా. రావు పరిశోధనకు విశేష గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయనకు మూడు స్వతంత్ర శాస్త్రీయ పురస్కారాలు ప్రదానం చేశారు. డాక్టర్ రావు చేసిన పరిశోధన క్లిష్టమైన మెదడు-మెడ ఎముకల సమస్యలతో బాధపడుతున్న రోగులకు మరింత సురక్షితమైన, తక్కువ గాయాలతో చేసే శస్త్రచికిత్స విధానంపై ఆధారపడింది. వైద్య నిపుణులు ఈ పరిశోధనను వినూత్నత, శాస్త్రీయ ప్రమాణాలు, రోగులకు ఉపయోగపడే సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డా. రావు మాట్లాడుతూ… ‘ప్రతి పరిశోధన వెనుక ఒక రోగి ఉంటాడు. ప్రతి క్లిష్టమైన కేసు మనకు కొత్త పాఠం నేర్పుతుంది. ఆ అనుభవాన్ని పరిశోధనగా మార్చి ప్రపంచ వైద్య సమాజంతో పంచుకోవడమే మా లక్ష్యం. ఈ గుర్తింపు మా మొత్తం బృందానికి దక్కిన గౌరవం’ అని అన్నారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ