ఉత్తరాఖండ్‌లోని లక్సర్ నియోజకవర్గంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ గుప్తా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఓటర్లను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు వివాదాస్పదంగా మారాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, తన నీటిని తాగి తనకు ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. సంజయ్ గుప్తా సభలో మాట్లాడుతూ "నేను ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాను. అప్పట్లో కలుషితమైన భూగర్భ జలాల వల్ల ప్రజలు ఇబ్బంది పడేవారు. నేను ప్రాజెక్టుల ద్వారా మంచినీటిని అందించాను. నా నీళ్లు తాగి కూడా నాకు ఓటు వేయకపోతే మీ కడుపులో పురుగులు పడతాయి, మీ కడుపు పేలిపోతుంది" అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. సంజయ్ గుప్తా తన హయాంలో (2012-2022) లక్సర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా వివరించారు. మహాతోలి వంటి అనేక గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశానని తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకలకు రాష్ట్ర మాంత్రికులు, అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పురితో పాటు పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.
తనకు ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి : బీజేపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق