సెప్టెంబర్ 9న జరిగే గ్రాండ్ ఈవెంట్‌కు యాపిల్ సంస్థ అధికారికంగా ఆహ్వానాలు పంపింది. భారత కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి 10:30 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. "సెప్టెంబర్ 9, బుధవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక యాపిల్ ఈవెంట్‌లో పాల్గొనండి" అని యాపిల్ డెవలపర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. యాపిల్ ఇండియా హోమ్‌పేజీలోనూ ఈ లైవ్ స్ట్రీమింగ్ వివరాలను పొందుపరిచారు. క్యూపర్టినోలోని యాపిల్ పార్క్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కీనోట్‌కు యాపిల్ 'సర్‌ప్రైజ్ అండ్ షైన్' అని పేరు పెట్టింది. దీనిబట్టి ఈసారి సరికొత్త హార్డ్‌వేర్ ఉత్పత్తులను పరిచయం చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. యాపిల్ పాత ట్రాక్ రికార్డ్ చూస్తే ఈవెంట్ జరిగిన తర్వాతి శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. గతేడాది కూడా భారత్‌లో ఇదే సమయంలో ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి.  ప్రముఖ బ్యాంకుల నుంచి ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు లభించే అవకాశం ఉంది. దీనికి తోడు ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రముఖ బ్యాంక్ కార్డులపై యాపిల్, దాని భాగస్వామ్య సంస్థలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందించనున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ లైవ్ ఆఫర్ పేజీలో యాపిల్ క్యాష్‌బ్యాక్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ వివరాలను పొందుపరిచారు. 

Post a Comment

أحدث أقدم