ఫైర్ బోల్ట్ సబ్ బ్రాండ్ బోల్ట్ ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే బోల్ట్ ఏస్ 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ఆకట్టుకునే బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ చాలా చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది. బోల్ట్ అందించిన ఈ బ్రాండ్ న్యూ 5జి ఫోన్ మొత్తం మూడు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఎంపికలో లభిస్తుంది. ఈ ఫోన్ బేసిక్ 4GB + 64GB వేరియంట్ రూ. 12,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ రూ. 13,999 ధరతో మరియు 8GB + 128GB వేరియంట్ రూ. 14,999 ధరతో లాంచ్ అయ్యాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ రెండు బెస్ట్ డీల్స్ అందించింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో వారికి రూ. 650 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 12,349 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది. బోల్ట్ ఈ ఫోన్ ను 6.79 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్క్రీన్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. బోల్ట్ ఈ ఫోన్ ని Unisoc T8200 చిప్ సెట్ తో జతగా 8GB ర్యామ్ మరియు 128 ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది. ఈ ఫోన్ ను ఆండ్రాయిడ్ 16 OS తో అందించింది. ఈ ఫోన్ లో 64MP మెయిన్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ FHD వీడియో సపోర్ట్ మరియు మంచి ఏఐ వీడియో ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ లో బిల్ట్ ఇన్ జెమినీ ఏఐ, ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Post a Comment

أحدث أقدم