జమ్మూ కశ్మీర్ లడఖ్‌లోని లేహ్‌లో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. గురువారం ఉదయం 9.54 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.3గా నమోదయింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వివరించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరగలేదని వెల్లడించింది. అయితే గురువారం ఉదయం 6 గంటలకు భూప్రకంపనలు వచ్చాయని తెలిపింది. దీని తీవ్రత 5.5గా నమోదు అయిందని పేర్కొంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. లడఖ్ తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే.
లేహ్‌లో మళ్లీ భూ ప్రకంపనలు : రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు
Thursday, August 13, 2026
Earth Tremors Again in Leh Ladakh region of Jammu and Kashmir Magnitude 4.3 Recorded on Richter Scale national These tremors took place within a span of just four hours
No comments:
Post a Comment