శాంసంగ్ గెలాక్సీ ఎస్26 ఎఫ్​ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల : అంతర్జాతీయ మార్కెట్లలో సెప్టెంబర్ 4 నుంచి విక్రయాలు ప్రారంభం

الجمعة، 28 أغسطس 2026

business Sales to Begin in International Markets on September 4 Samsung Galaxy S26 FE Smartphone Launched technology

t f B! P L

శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌లో భాగంగా 'గెలాక్సీ S26 ఎఫ్​ఈ' (ఫ్యాన్ ఎడిషన్) మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. సెప్టెంబర్ 4 నుంచి ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారతదేశంలో దీని ధర, లభ్యత వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఉండే ప్రీమియం ప్రాసెసింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను తక్కువ ధరకే అందించడం ఈ 'ఫ్యాన్ ఎడిషన్' సిరీస్ ప్రత్యేకత.ప్రీమియం లుక్, అద్భుతమైన కెమెరా ఫీచర్లు కోరుకునే మిడ్-రేంజ్ వినియోగదారులకు ఈ సిరీస్ ఎప్పుడూ మొదటి ఎంపికగా నిలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో అలరిస్తోంది. 120హెచ్​జెడ్ రీఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వెలుతురు ఎక్కువగా ఉన్న చోట కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. వేగవంతమైన ఎక్సినోస్ 2500 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ బ్లూబెర్రీ, గ్రాఫైట్, పిస్టాచియో అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత సరికొత్త వన్ యూఐ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న మొదటి గెలాక్సీ స్మార్ట్​ఫోన్ ఇదే కావడం విశేషం. రోజువారీ పనులను సులువు చేసే పలు రకాల గెలాక్సీ ఏఐ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. ఫోటోల్లో ఉండే వేర్వేరు వస్తువులను ఒకేసారి గుర్తించే 'సర్కిల్ టు సెర్చ్', సాధారణ వాయిస్ కమాండ్లతో ఫోటోలను ఎడిట్ చేసే 'ఫోటో అసిస్ట్', గ్యాలరీలోని వీడియోల ఆధారంగా కొత్త క్లిప్‌లను క్రియేట్ చేసే 'జెమినీ ఓమ్ని' ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటాయి. ఫోన్  వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్​ని ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్​26 ఎఫ్​ఈలో ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ సపోర్ట్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. రాత్రివేళల్లో స్పష్టమైన ఫోటోల కోసం నైటోగ్రఫీ టెక్నాలజీని మరింత మెరుగుపరిచారు. వీడియో రికార్డింగ్‌లో ఎంచుకున్న వ్యక్తిని ఆటోమేటిక్‌గా ట్రాక్ చేసే 'మై ఫ్యాన్‌క్యామ్', వీడియోలు ఊగకుండా స్థిరంగా ఉండేందుకు హారిజాంటల్ లాక్‌తో కూడిన సూపర్‌స్టెడీ ఫీచర్లను కొత్తగా పరిచయం చేశారు. ఈ ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 45డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సరిగ్గా 30 నిమిషాల్లో 69 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. దీంతో పాటు 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్‌కు ఏకంగా 7 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) అప్‌డేట్లు, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని శాంసంగ్ ప్రకటించడం పెద్ద ఊరట. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్ ఇచ్చారు.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ