బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మధ్య జరిగిన 25వ విడత ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో ఈ మేరకు 8 అంశాలతో కూడిన ఏకాభిప్రాయానికి వచ్చాయి. సరిహద్దుల నిర్ధారణ వేగవంతం చేసేందుకు ఒక నిపుణుల బృందాన్ని, సరిహద్దు నిర్వహణ కోసం ప్రత్యేక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. తూర్పు, మధ్య సెక్టార్లలో సైనిక సంప్రదింపులను వేగవంతం చేసేందుకు అదనంగా మరో 2 సమావేశ కేంద్రాలుమరియు 2 కొత్త హాట్‌లైన్ ఛానెళ్లను అందుబాటులోకి తేనున్నారు. ఆరేళ్ల విరామం తర్వాత నాథూ లా, షిప్కి లా మార్గాల్లో వాణిజ్య పునరుద్ధరణతో పాటు, కైలాష్-మానసరోవర్ యాత్రకు సంబంధించి చైనా సహకారాన్ని భారత్ ప్రశంసించింది. సెప్టెంబర్‌లో భారత్-చైనా నిపుణుల స్థాయి సమావేశం నిర్వహించి జలసంబంధ డేటా పంచుకోవడం, ఒప్పందాల పునరుద్ధరణపై చర్చించనున్నారు. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లో జరిగే భారత అధికారిక కైలాష్-మానసరోవర్ యాత్రకు మరిన్ని బృందాలను అనుమతించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత పక్షం ప్రశంసించింది. సరిహద్దు నదులకు సంబంధించిన అంశాలపైనా ఇరు దేశాలు చర్చించాయి. భారత్-చైనా నిపుణుల స్థాయి యంత్రాంగం తదుపరి సమావేశాన్ని సెప్టెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. జలసంబంధ డేటా పంచుకోవడం, సంబంధిత అవగాహన ఒప్పందాల పునరుద్ధరణ వంటి అంశాలపై సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకరించారు. ఇరాన్, ఉక్రెయిన్‌లలో కొనసాగుతున్న సంఘర్షణలు ప్రపంచ ఇంధన సరఫరా గొలుసులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ భారత్, చైనాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు రానున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రతినిధుల మధ్య తాజా సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్ - చైనా మధ్య జరిగిన 25వ విడత ప్రత్యేక ప్రతినిధుల చర్చలు : ఎనిమిది అంశాలలో ఏకాభిప్రాయం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق