తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి 44పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలానికి ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు, అర్ధరాత్రి దాటిన తర్వాత ముందు వెళ్తున్న లారీ టైరు పేలిపోవడంతో దానిని తప్పించే క్రమంలో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌తో సహా 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో అత్యధికులు గాఢ నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భయాందోళనకరంగా మారింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే పెట్రోలింగ్ మరియు భూత్పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో దాదాపు 21 మందికి గాయాలు కాగా, 108 అంబులెన్సుల ద్వారా వారిని మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో తీవ్రంగా గాయపడిన గుంటూరుకు చెందిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు సమీప పెట్రోల్ బంక్ మీదుగా వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ప్రైవేట్ బస్సు బోల్తా : 21 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق