మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాకు చెందిన ప్రముఖ విలేజ్ బేస్డ్ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రచన గుర్జార్ ఇంట్లో జరిగిన దొంగతనం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. రచన గుర్జార్ రెండు రోజుల క్రితమే తన ఇన్స్టాగ్రామ్ రీల్లో ఒంటి నిండా భారీ గోల్డ్ జ్యువెలరీ వేసుకుని, తళతళలాడిపోతూ ఒక వీడియో పోస్ట్ చేసింది. సదరు రీల్ కు లైకులు, కామెంట్లు రావడమే ఆలస్యం స్థానిక దొంగల కన్ను ఆ 'గోల్డ్ రీల్' మీద పడింది. ఇంకేముంది, 'లొకేషన్' ఎక్కడుందో దొంగలు ఈజీగా ట్రేస్ చేశారు. ఆమె ఇంట్లో ఏయే మూల ఏముందో రీల్స్ ద్వారానే ఒక ఐడియాకు వచ్చేసి, పక్కా ప్లాన్ తో అర్ధరాత్రి సమయంలో రచన గుర్జార్ నివాసంలోకి చొరబడిన దొంగలు, అత్యంత తెలివిగా ప్రవర్తించారు. రచన, ఆమె భర్త పడుకున్న బెడ్రూమ్ తలుపులను బయటి నుంచి లాక్ చేసి, ఆ తర్వాత ఇంట్లోని బీరువాలను బద్దలు కొట్టి రెండు రోజుల క్రితం రీల్లో చూపించిన ఆ బంగారు నగలు, వెండి ఆభరణాలు , ఇంట్లో ఉన్న భారీ క్యాష్ ను బ్యాగుల్లో సర్దేసుకుని తెల్లవారేసరికి పత్తా లేకుండా పారిపోయారు.
ఇన్స్టాగ్రామ్ రీల్లో బంగారం చూపి హోమ్టూర్ చేసిన యూట్యూబర్ : లొకేషన్ ట్రేస్ చేసి దొంగతనం చేసిన దొంగలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق