ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ 'పీటర్ డయామాండిస్'తో మాట్లాడుతూ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఏఐ, రోబోట్లు నిరంతరం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయగలవు. తద్వారా వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయి. చివరికి మనుషులు చేయడానికి పనులు లేకుండా పోతాయని అన్నారు. మనుషుల అవసరం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కార్మికుల అవసరం ఉండదు, వారికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఒక దశలో డబ్బు అవసరం ఉండదని మస్క్ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన మీరు, డబ్బు అవసరం ఉండదని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని మస్క్‌ను ఇంటర్వ్యూ చేసే పీటర్ డయామాండిస్ అన్నారు. భవిష్యత్తులో ఇది నిజం అవుతుందని ఎలాన్ మస్క్ జవాబిచ్చారు. భవిష్యత్తులో ప్రజలు ఉద్యోగాల ద్వారా సంపాదించకపోయినా జీవించగలిగేలా 'యూనివర్సల్ హై ఇన్‌కమ్' అనే వ్యవస్థ వస్తుందని మస్క్ గతంలో సూచించారు. ఈ విధానంలో ప్రతి ఒక్కరికీ కనీస జీవనానికి సరిపడే ఆదాయం లభిస్తుంది. అవసరమైనవారికి ప్రభుత్వాలే డబ్బులు ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. తద్వారా ఆటోమేషన్ వల్ల వచ్చే మార్పులను సమాజం ఎదుర్కోగలుగుతుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు.
ఏఐ రోబోలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయి : భవిష్యత్తులో డబ్బు అవసరం ఉండదు : ఎలాన్ మస్క్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق