ఫ్యూచర్ సిటీలో ఎఫ్‌సీడీఏ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ పనులను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్‌సీడీఏ కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ పనులపై మార్గనిర్దేశం చేశారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం శ్రీధర్ బాబు, పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలవడం ఖాయమని శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఫ్యూచర్ సిటీలో పనులను పరిశీలించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق