ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం.. దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీలను ప్రదానం చేసింది. ఈ ఏడాది మొత్తం 131 మందికి ఈ పురస్కారం దక్కగా, వారిలో ఐదుగురు పద్మవిభూషణ్‌, 13 మంది పద్మభూషణ్‌, 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు.


Post a Comment

أحدث أقدم