భారతీయ రూపాయి మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. నేడు ట్రేడింగ్ సెషన్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 95.39 వద్ద ప్రారంభమైంది. మునుపటి సెషన్‌లో ఇది 95.23 వద్ద ముగిసింది. నెలాఖరున నిధుల ప్రవాహాల ఒత్తిడితో పాటు, ఇరాన్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తూ అమెరికా జరిపిన తాజా దాడులు రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గత మూడు నెలలుగా సాగుతున్న ఇరాన్ యుద్ధానికి తెరదించుతూ, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలసంధిని తిరిగి తెరిచేందుకు ఒక ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం ఇన్వెస్టర్లలో వ్యక్తమైంది. దీనివల్ల డాలర్ కూడా కొంత నష్టాల్లోనే సాగింది. అయితే, ఇంతలోనే ఇరాన్ లక్ష్యాలపై అమెరికా మళ్లీ నూతన దాడులకు తెగబడటంతో మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా తలకిందులైంది. శాంతి ఒప్పందంపై ఆశలు అడుగంటడంతో ముడిచమురు ధరల భయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రూపాయి విలువ మరింత పాతాళానికి పడిపోకుండా నిరోధించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. ఆర్బీఐ మార్కెట్లో చురుగ్గా జోక్యం చేసుకుని, భారీగా డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయిపై ఉన్న ఊహాజనిత ఒత్తిడిని గణనీయంగా తగ్గించగలిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మెరుగుపడుతున్న రిస్క్ అపిటైట్  కూడా రూపాయికి కొంత అండగా నిలిచింది. లేదంటే రూపాయి మరింత క్షీణించి ఉండేదని ఆర్థిక విశ్లేషణ సంస్థ 'ఫిన్‌రెక్స్' పేర్కొంది.

Post a Comment

أحدث أقدم