ర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 3వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. డీకే శివకుమార్‌కు దైవభక్తి, జ్యోతిష్యంపై అపారమైన నమ్మకం ఉంది. ఈ క్రమంలోనే ఆయన తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని సంప్రదించి, శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నట్లు టాక్. జూన్ 3న ప్రమాణస్వీకారం చేస్తే రాజకీయంగా తిరుగుండదని జ్యోతిష్యులు సూచించడంతో ఆయన ఆ తేదీకే మొగ్గు చూపారు. అయితే, ఈ కార్యక్రమాన్ని భారీ హంగు ఆర్భాటాలు లేకుండా, అత్యంత సాదాసీదాగా నిర్వహించాలని డీకే భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి.

Post a Comment

أحدث أقدم