కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలో రేపటి నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభంకానున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. రేపు గురువారం ‍ప్రారంభమై మే 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకూ పుష్కరాలు జరగునున్నట్లు తెలిపింది. ఈ అంత్యపుష్కరాలకు దాదాపు 40 లక్షల ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని అయిన సరస్వతి నదుల సంగమం. ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయి, ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం 12 రోజుల పాటు వివిధ రకాల హోమాలు,పూజలు నిర్వహించబడతాయని ఆలయ అధికారులు తెలిపారు. మే 21 ఉదయం 5:43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ద్వారా పుష్కర స్నానం ప్రారంభమవుతుంది. రాష్ట్ర గవర్నర్ కూడా ఈ పుణ్యస్నానంలో పాల్గొననున్నారు. ప్రతి రోజు వివిధ పీఠాధిపతులు పాల్గొని హోమాలు, సాయంత్రం హారతి, తెప్పోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 21న మహా గణపతి హోమం నుంచి ప్రారంభమై జూన్ 1న లఘు చండి మహా పూర్ణాహుతితో ముగుస్తాయని అధికారులు తెలిపారు.

Post a Comment

أحدث أقدم