తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. దీంతో ధర్పల్లి, సిరికొండ మండలంలోని తాటిపల్లి, కుర్థులపేట లో వరి పంట దెబ్బ తిన్నది. ఇప్పటికే కోతలు చేపట్టగా, కొద్దిమేర మిగిలిపోయిన పంట వడగండ్ల వానకు పూర్తిగా నేలరాలి చేతికందకుండా పోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మోస్తరు వర్షం కురిసినప్పటికీ కేవలం సిరికొండ మండలంలో పలు గ్రామలలో వడగండ్లు పడడంతో పంట దెబ్బతిన్నదని రైతులు వాపోయారు. అకాల వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. సిరికొండ మండలం సర్పల్లి తండా, తాళ్ల రామడుగు, మూషీనగర్, గడ్కోల్, కొండూర్, రావుట్ల తదితర గ్రామాల్లో ధాన్యం తడిది ముద్దయ్యింది. వరి పైరు నేలవాలింది. ముందుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు వాపోతున్నారు. కొన్నిచోట్ల వడగళ్లు పడటంతో కోతకు వచ్చిన ధాన్యంతో పాటు కూరగాయల పం టలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Post a Comment

أحدث أقدم