హర్మూజ్ జలసంధిని ఎల్పీజీ లోడ్‌తో భారత్‌కు బయల్దేరిన 'జగ్ విక్రమ్' నౌక సురక్షితంగా దాటింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత హర్మూజ్ జలసంధిని దాటిన మొట్టమొదటి నౌక 'జగ్ విక్రమ్'. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జలసంధిని దాటిన ఈ నౌక, శనివారం మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోకి ప్రవేశించింది. ముంబయికి చెందిన 'గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ'కి చెందిన ఈ గ్యాస్ ట్యాంకర్, సుమారు 20,000 టన్నుల ఎల్పీజీని భారత్‌కు తీసుకువస్తోంది. షిప్పింగ్ డేటా నివేదికల ప్రకారం జలసంధిని దాటడానికి అనుమతి కోసం 'జగ్ విక్రమ్' వారం రోజులకు పైగా గల్ఫ్ జలాల్లోనే వేచి చూడాల్సి వచ్చింది. భద్రతా కారణాలు మరియు అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఈ ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నౌక సురక్షిత ప్రాంతంలోకి రావడంతో మరికొద్ది రోజుల్లోనే భారత తీరానికి చేరుకోనుంది. జగ్ విక్రమ్‌తో పాటు మరో 15 భారత రిజిస్టర్డ్ నౌకలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లోనే ఉన్నాయి. ఇవి కూడా త్వరలోనే భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
إرسال تعليق