వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఎంత పెంచుతారు..? ఎప్పటినుంచి పెంచుతారు? అనేది మాత్రం ప్రకటించలేదు. అయితే నామమాత్రంగానే పెంచుతామని వొడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది. ఎయిర్‌టెల్ ఇప్పటికే రీఛార్జ్ ధరలను పెంచగా, వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పట్టింది. ఎయిర్‌టెల్ ఇటీవల టారిఫ్ ధరలను 4 నుంచి 5 శాతం పెంచింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా అదే మొత్తంలో పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఏడాది రీఛార్జ్ ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మొబైల్ ఉపయోగించే వారిపై అదనపు భారం పడనుంది. దాదాపు ఈ ఏడాది 15 శాతం మేర రీఛార్జ్ ధరలను కంపెనీలు పెంచే అవకాశముందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. 15 శాతం అంటే మొబైల్ యూజర్లుకు ఈ ఏడాదిలో పెద్ద షాక్ తగలనుందని చెప్పవచ్చు. దీంతో సామాన్యులకు ఇది గుడిబండగా మారనుంది.
రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన వొడాఫోన్ ఐడియా
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق