సికింద్రాబాద్-హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ (12438/12437)కు అదనంగా ఓ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ను కలుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మార్పు నిజాముద్దీన్ నుంచి బయలుదేరే రాజధాని ఎక్స్ ప్రెస్ కు ఈ నెల 19వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రాజధాని ఎక్స్ ప్రెస్ కు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ కోచ్ ఇకపై శాశ్వతంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ కు రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు (12437) ప్రతీ రోజూ మధ్యాహ్నం 12.50కు బయలుదేరుతుంది. ఇది ఇది మరుసటి రోజు ఉదయం 10.30కు నిజాముద్దీన్ కు చేరుకుంటుంది. అలాగే నిజాముద్దీన్ లో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 3.35కు బయలుదేరే రాజధాని ఎక్స్ ప్రెస్ (12438) సికింద్రాబాద్ కు సోమవారం మధ్యాహ్నం 1.40కు చేరుకుంటుంది.
సికింద్రాబాద్-హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ కు అదనంగా ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ : దక్షిణ మధ్య రైల్వే
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق