కాకతీయ యూనివర్సీటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు కళాశాల సమీపంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ వద్దకు వెళ్లారు. అనంతరం కాలువలోకి దిగారు. వరద ప్రవాహం అధికంగా ఉండడం, వీరికి సరిగా ఈత రాకపోవడంతో ముగ్గురూ కొట్టుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయినా యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభించగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Post a Comment

أحدث أقدم