దేశంలో ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కిలోగ్రాముల చిన్న సిలిండర్ల (ఎఫ్‌టీఎల్ సిలిండర్లు) సరఫరాను వేగవంతం చేసింది. సాధారణంగా అందించే 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్లకు భిన్నంగా, ఈ చిన్న సిలిండర్లు మార్కెట్ ధరలకు అందుబాటులో ఉంటాయి. వీటిని సమీప గ్యాస్ ఏజెన్సీల వద్ద నేరుగా కౌంటర్‌లో పొందవచ్చు. ఈ చిన్న సిలిండర్లకు డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతోంది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 6.6 లక్షల సిలిండర్లు విక్రయమైనట్లు పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎల్పీజీ కొరత సమయంలో ఈ సిలిండర్లు వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా, ఈ ఎఫ్‌టీఎల్ సిలిండర్లను కొనుగోలు చేయడానికి చిరునామా రుజువు అవసరం లేదు.. కేవలం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. దీంతో ఎవరైనా సులభంగా ఈ సిలిండర్లను పొందవచ్చు. ఇక, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. భయాందోళనలతో అధికంగా కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరింది. అలాగే బ్లాక్ మార్కెటింగ్, నిల్వలపై కఠిన తనిఖీలు నిర్వహిస్తూ, 3,700కు పైగా దాడులు చేసి, దాదాపు 1,000 షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు 36 మంది డీలర్లపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.
إرسال تعليق