ఇన్‌స్టాగ్రామ్ ఏదైనా పోస్ట్‌పై కామెంట్ చేసినప్పుడు స్పెల్లింగ్ తప్పులు దొర్లినా లేదా సమాచారం మార్చాలన్నా ఆ కామెంట్‌ను డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా చేయాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు నేరుగా కామెంట్‌ను ఎడిట్ చేసుకొనే వెసులుబాటును సంస్థ కల్పించింది. వినియోగదారులు తమ కామెంట్‌ను పోస్ట్ చేసిన 15 నిమిషాల లోపు ఎప్పుడైనా సవరించుకోవచ్చు. ఈ నిర్ణీత సమయంలో ఎన్నిసార్లైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ కేవలం టెక్స్ట్ కు మాత్రమే పరిమితం. కామెంట్లలో ఉపయోగించే ఫోటోలు, GIFలు లేదా స్టిక్కర్లను మార్చడం కుదరదు. ఏదైనా మార్పు చేసినప్పుడు సదరు కామెంట్ పక్కన ‘Edited’ అనే ట్యాగ్ కనిపిస్తుంది. దీనివల్ల ఆ కామెంట్‌ను సవరించినట్లు ఇతరులకు తెలుస్తుంది, కానీ గతంలో ఉన్న అసలు కామెంట్ మాత్రం ఎవరికీ కనిపించదు. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి యాప్‌లలో ఇప్పటికే ఈ తరహా ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ సదుపాయం రావడంతో పొరపాట్లు సరిదిద్దుకోవడం సులభం కానుంది.
ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌పై కామెంట్ ను ఎడిట్ చేసుకొనే వెసులుబాటు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق