ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం వుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు కురిసినప్పటికీ, పగటి గరిష్ట ఉష్ణోగ్రతల్లో మాత్రం రాబోయే వారం రోజుల్లో పెద్దగా మార్పు ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 

Post a Comment

أحدث أقدم