హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్నీ కమిటీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. త్వరలో అన్నీ స్థాయిల కమిటీలు నియమించాలని ఆదేశించారు. కమిటీల నియామక బాధ్యతల్ని కేసీఆర్‌కు అప్పగించారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజారుతోంది. రాష్ట్రంలోని ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ప్రభుత్వానికి ధాన్యం కొనడానికి చేతకావడం లేదు. కాంగ్రెస్‌ది చిల్లర ప్రభుత్వం'అని ధ్వజమెత్తారు. మరోవైపు, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తేజస్వి సూర్య ఒక వెధవ. ఆయన అలా మాట్లాడుతుంటే ఒక్కరూ నోరుమెదపలేదు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు సభలో ఉంటే రణరంగం అయ్యేది. ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరు మెదపలేదు'అని అన్నారు.

Post a Comment

أحدث أقدم