తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ శంకర్‌కు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
إرسال تعليق