తమిళనాడులోని విరూద్‌నగర్ జిల్లా కుట్టనార్‌పట్టి గ్రామంలో బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి 10 కిలోమీటర్ల వరకు ప్రకంపనలు వినిపించాయి. సంఘటనా స్థలంలో ఐదు ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పుతున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పడానికి అధికారులు కష్టపడుతున్నారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది.
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు : 17 మంది దుర్మరణం, 9 మందికి తీవ్ర గాయాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق