దేశీయ మార్కెట్లో  థామ్సన్ గ్లాడియేటర్, ఎయిర్ కమాండర్ మరియు SUV సిరీస్ నుండి కొత్త ఎయిర్ కూలర్లు లాంచ్ చేసింది. వీటిలో పర్సనల్ మరియు రూమ్ ఎయిర్ కూలర్లు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరి అవసరాలకు తగిన కూలర్ ఎంచుకునే అవకాశం అందించింది. థామ్సన్ మొత్తంగా 11 కూలర్లను కొత్తగా మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త కూలర్లు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ నుంచి మొదలయ్యే ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కూలింగ్ డేస్ సేల్ నుంచి ఈ కూలర్స్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుకోవచ్చని థామ్సన్ తెలిపింది. థామ్సన్ ఈ కొత్త కూలర్లను గాలిని బాగా విసిరే హెవీ డ్యూటీ ఫ్యాన్ తో అందించింది. అంతేకాదు, ఇందులో మంచి చల్లని గాలిని ప్రసరింపచేసే తేనెపట్టు (హనీకోంబ్) డిజైన్ ప్యాడ్ కలిగి ఉంటాయి. వీటిలో స్మార్ట్ కూలర్లు రిమోట్ కంట్రోల్ సపోర్ట్ తో వస్తాయి. అంతేకాదు, పటిష్టమైన బాడీ మరియు ఆకట్టుకునే డిజైన్ తో కూడా ఉంటాయి.

Post a Comment

أحدث أقدم