త్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న పికప్ ట్రక్కు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో ప్రయాణికులు గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డారు. డ్రైవర్ మురారి(25), మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Post a Comment

أحدث أقدم