పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. పెట్రోల్ పై లీటర్ కు రూ.13 నుంచి రూ.3కు తగ్గించగా, డీజిల్ పై ఉన్న రూ.10ను పూర్తిగా తొలగించినట్లు పేర్కొంది. ఇరాన్ పై యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద అంతరాయం నెలకొంది. చమురు, గ్యాస్ సరఫరాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ ధరలపై సంక్షోభం నెలకొంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం వాహనదారులకు ఊరట కల్పించేలా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. మరోవైపు దేశంలో పెట్రోల్, డిజీల్ కొరతపై భయాందోళన మొదలైంది. పెట్రోల్ బంకుల్లో వాహనదారులు క్యూలు కడుతున్నారు. దేశంలో ఇంధన కొరత లేదని..ఎలాంటి భయాందోళన అవసరం లేదని తెలిపింది. 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో ఇంధన కొరతపై అసత్య ప్రచారం జరుగుతండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
إرسال تعليق