తెలంగాణలోని వరంగల్ మున్సిపల్ సిబ్బంది చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించడంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు రంగంలోకి దిగారు. కాశిబుగ్గ ప్రాంతంలో పన్ను చెల్లించలేదన్న నెపంతో ఓ ఇంటి యజమాని ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌ను అధికారులు తీసుకెళ్లడం విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ కావడంతో అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. 'లక్షల రూపాయల పన్ను బకాయిలు ఉన్న బడా బాబుల జోలికి వెళ్లని అధికారులు, పూట గడవని పేదవాడి వంటగదిలో సిలిండర్‌ను ఎలా తీసుకెళ్తారు?' అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ కొరతతో జనం అల్లాడుతుంటే ఉన్న ఒక్క సిలిండర్‌ను ఇలా సీజ్ చేయడం ఎంత మాత్రమూ తగదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇంటి పన్ను చెల్లించిన తర్వాత సిబ్బంది ఆ గ్యాస్ బండను ఇంటి యజమానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడే కాకుండా పోచమ్మమైదాన్‌ ఏరియాలో కూడా పన్ను చెల్లించని కారణంగా ఓ ఇంటి నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

Post a Comment

أحدث أقدم