హోండా సిటీ, ఎలివేట్, అమేజ్ కార్లపై డిస్కౌంట్ ఆఫర్ !

الجمعة، 6 مارس 2026

Amaze cars automobile business Discount offer on Honda City Elevate national provide benefits of about Rs. 1.97 lakh on three cars technology

t f B! P L


హోండా కంపెనీ మూడు కార్లపై దాదాపు రూ.1.97 లక్షల ప్రయోజనాలను అందించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీకి చెందిన మూడు కార్లు ఈనెల ఎండింగ్ లోపు కొనుగోలు చేస్తే ఇవి వర్తించనున్నాయి. ఇప్పటికే ఇవి ఎంతో ఆదరణ పొందిన కార్లు అయినప్పటికీ వీటిపై తగ్గింపు ధరను ప్రకటించడంతో మరింత సేల్స్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సిటీ కారుపై డిస్కౌంట్లతో పాటు ఆఫర్లను ప్రకటించింది. సెడాన్ వేరియంట్ లో ఉన్న ఈ కారు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. దీనిని ప్రస్తుతం రూ.20 లక్షల ధరతో విక్రయిస్తున్నారు. ఈ కారుపై రూ.1.97 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు అని తెలిపింది. అయితే కేవలం పెట్రోల్ వేరియంట్ ఉన్న కారుపై రూ.1.56 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.11.95 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.16.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఎలివేట్ కారు మిడ్ సైజు SUV వేరియంట్ అయినా ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 121 హాఫ్ పవర్ అందిస్తూ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ కారు ధర రూ.11.6 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.16.25 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దీనిపై రూ.1.81 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ మోడల్ ఎస్ యు వి హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ కు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. అమేజ్ కారుపై కూడా తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తోపాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 90 hp అందిస్తోంది. ప్రస్తుతం అమేజ్ ధర రూ.7.47 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే పాత అమేజ్ మోడల్ పై రూ.68,000 డిస్కౌంట్ రాగా.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అమేజ్ పై రూ.57,000 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ