ప్రముఖ చరిత్రకారుడు, విద్యావేత్త జైశెట్టి రమణయ్య (85) కన్నుమూశారు. తన జీవితాన్ని పూర్తిగా బోధనకే అంకితం చేసిన రమణయ్య అనేక మంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు. కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో రమణయ్య హిస్టరీ సబ్జెక్ట్ బోధించారు. ఆ సమయంలోనే ఆయన బోధనా శైలి, చరిత్రపై లోతైన అవగాహన కేసీఆర్‌పై ప్రత్యేక ప్రభావం చూపింది. గురువు-శిష్య సంబంధం ఎంతో ఆత్మీయంగా ఉండేదని అనేక సందర్భాల్లో కేసీఆర్ కూడా గుర్తుచేసుకున్నారు. ఒకసారి కేసీఆర్‌ను కలిసిన సందర్భంలో రమణయ్య మాట్లాడుతూ అతను ఎంత బిజీగా ఉన్నా నా క్లాస్ మాత్రం ఎప్పుడూ మిస్సయ్యేవాడు కాదు అని చెప్పడం కేసీఆర్‌పై ఉన్న ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈ మాటలు గురువు-శిష్య బంధానికి నిదర్శనంగా నిలుస్తాయి. తెలంగాణ ఉద్యమం తరువాత కేసీఆర్ తన గురువును ఇంటికి వెళ్లి కలిసినప్పుడు, రమణయ్య ఆయనను ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటూ ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సంఘటన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత స్పష్టం చేసింది. రమణయ్య గారు కేవలం ఉపాధ్యాయుడిగానే కాకుండా చరిత్రపై విశేషమైన పరిశోధనలు చేసిన చరిత్రకారుడిగా కూడా పేరు పొందారు. ఆయన బోధన వల్ల అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.
إرسال تعليق