బీర్ల ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో కంపెనీలకు మార్జిన్ ఖర్చులు తగ్గుతున్నాయి. దీంతో తక్షణమే ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్దం అయ్యాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే బీర్ల ఉత్పత్తికి ఖర్చు 15 శాతం పెరిగింది. కాగా, ఇదే సమయంలో విదేశీ బ్రాండ్ల ఉత్పత్తుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అమ్మకాలు భారంగా మారుతున్నాయి. దీంతో.. బీర్ల ధరల పెంపు కు రంగం సిద్దం చేసారు. కొత్త ధరలు ఫిక్స్ అయ్యాయి. బీర్ల ధరల పెంపుకు రంగం సిద్దమైంది. బీర్ల ఉత్పత్తి ధరలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఆ భారం కొనుగోలు దారుల పైన మోపేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. ధరలను పెంచక తప్పద ని బ్రూవర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఉత్పత్తి ట్యాక్సులు, ఇతర ఖర్చులు పెరగడంతో బీర్ల తయారీ కంపెనీలు సతమతమవుతున్నాయి. పన్నుల కారణంగా ఉత్పత్తి ఖర్చులు 12 నుంచి 15 శాతం వరకు పెరిగాయని, కంపెనీలపై అదనపు భారం పడుతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో బీరు సీసాల ధరలు ధరలు 20 శాతం పెరిగాయి. ఇక ఇతర మెటిరీయల్ ఖర్చులు కూడా 20 నుంచి 25 శాతం పెరిగాయి. రవాణా ఖర్చులు కూడా 10 శాతం మేర పెరిగటంతో.. బీర్ల ధరల పెంపు అనివార్యంగా మారిందని చెబుతున్నారు. ప్రధానంగా ఏబీ ఇన్‌బెవ్, కార్ల్‌బర్గ్ కంపెనీలు 85 శాతం బీర్ అమ్మకాలను చేపడుతున్నాయి. అన్ని రకాలుగా ఖర్చులు పెరుగుతుండటంతో బీర్ల ధరలను పెంచాలని కంపెనీలు తాజాగా ప్రతిపాదనలు సమర్పించాయి. ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో కంపెనీలకు మార్జిన్ ఖర్చులు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ బీర్ కేస్‌పై రూ.20 మేర ధరను పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలకు ఈ అంశం పైన ప్రతిపాదనలు సమర్పించారు. రేట్లు పెంపు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
إرسال تعليق