తెలంగాణ లోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని ఓ గదిలో దాదాపు 35 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. హత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
إرسال تعليق