తల్లి అనుమతి లేకుండా కుమారుడు ఆమె ఇంట్లో ఉండే హక్కు లేదని ఒరిస్సా హైకోర్టుకీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును 2019లో సమల్ అనే మహిళ దాఖలు చేశారు. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒక కుమారుడు, అతని భార్య ఆమె ఇంట్లో ఉంటూ తనను వేధిస్తున్నారని ఆమె కోర్టుకు తెలిపారు. ఈ సమస్యలు ఉండటంతో ఆమె తన ఇంటిని వదిలి, ఇతర పిల్లలు ఏర్పాటు చేసిన అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, కుమారుడు మాత్రం ఆ ఇల్లు కుటుంబ ఆస్తి అని వాదించాడు. తాను, తన సోదరులు సంపాదించిన డబ్బుతో తల్లి ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించిందని, తల్లి పేరు కేవలం రికార్డు కోసం మాత్రమే ఉందని చెప్పాడు. అయితే ఈ వాదనను నిరూపించే ఆధారాలు కోర్టుకు చూపలేకపోయాడు. కోర్టు తల్లి పక్షాన తీర్పు ఇచ్చింది. ఆస్తి పూర్తిగా తల్లి పేరులోనే ఉందని, అది ఆమె సొంత ఆస్తి అని స్పష్టం చేసింది. కుమారుడు ఆ ఇంట్లో ఉండటం తల్లి అనుమతితోనే జరిగిందని, ఆ అనుమతి లేకపోతే అతనికి అక్కడ ఉండే హక్కు లేదని కోర్టు తెలిపింది.
తల్లి అనుమతి లేకుండా కుమారుడు ఆమె ఇంట్లో ఉండే హక్కు లేదు : ఒరిస్సా హైకోర్టు తీర్పు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق